ఖగోళంలో అద్బుతం...నెలలో రెండు సూపర్ మూన్ లు

By :  Kalyan
Update: 2023-07-31 09:44 GMT

ఈఏడాది ఆగస్టు నెలకు చాలా స్పెషల్ ఉంది. సాధారణంగా ఒక నెలకు ఒకటే పౌర్ణిమ వస్తుంది. కానీ ఈ ఏడు ఆగస్టులో మాత్రం రెండు పౌర్ణిమలు వస్తున్నాయి. అవి కూడా సూపర్ మూన్ తో. కాబట్టి ఆగస్టు నెల అరుదైన సూపర్ మూన్ లతో వెలిగిపోనుంది.

ఖగోళవిందుకు సిద్ధంగా ఉండండి అని చెబుతున్నారు సైంటిస్టులు. ఒకేనెలలో రెండు అరుదైన సూపర్ మూన్ లు కనువిందు చేయనున్నాయి. చంద్రుని కక్ష్య సాధారణం కంటే భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది తొలి సూపర్‌మూన్‌ జూలైలో వచ్చింది. నాల్గవ, చివరిది సెప్టెంబర్‌లో ఉంటుంది. 2018లో ఒకే నెలలో చివరిసారిగా రెండు పూర్తి సూపర్‌మూన్‌లు ఆకాశంలో కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీని తర్వాత 2037 వరకు మళ్ళీ ఇలాంటివి కనిపించవని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీటిలో మొదటి పౌర్ణమి ఆగస్టు 1న కనిపిస్తుంది. దీనిని స్టర్జన్ మూన్ అని పిలుస్తారు. సూపర్ మూన్ కావడంతో ఈ చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈరోజు అర్ధరాత్రి 2.32 గంటలకు సర్టన్ చంద్రుడు అతి పెద్దగా కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ ఆగస్టు 30 న వచ్చే రోజు బ్లూమూన్ కనిపిస్తుంది. జూలైలో కనిపించిన చంద్రునికి బక్ మూన్ అని పేరు పెట్టారు. బక్ మూన్ సమయంలో చంద్రుడు, భూమి మధ్య 361,934 కిమీ దూరంలో ఉంది. ఇది సాధారణం కంటే 22,466 కిమీ తక్కువ. సాధారణ పౌర్ణమితో పోలిస్తే, ఇది 5.8 శాతం పెద్దగా, 12.8 శాతం ప్రకాశవంతంగా కనిపించింది.


Tags:    

Similar News