టాప్ టెన్ సరసన చేరనున్న విరాట్ కోహ్లీ

Update: 2023-07-19 09:46 GMT

రేపటి నుంచి వెస్టిండీస్, భారత్ ల మధ్య రెండో టెస్ట్ మొదలవనుంది. మొదటి టెస్ట్ లో ఘనవిజయం సొంతం చేసుకున్న భారత్ రెండవ టెస్ట్ కూడా గెలిచి సీరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఇది పక్కన పెడితే ఇరుజట్లకు ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. రెండు జట్ల మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళపేరు మీద విజయం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మరోవైపు భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి కూడా ఇది స్పెషల్ మ్యాచ్.

భారత్, వెస్టిండీస్ రెండ టెస్ట్ మ్యాచ్ తో విరాట్ 500 మ్యాచ్ క్లబ్ లో చేరనున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫ్మార్మాట్ లు కలిపి 499 మ్యాచ్ లు ఆడాడు. రేపటి టెస్ట్ మ్యాచ్ తో 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ చేరనున్నాడు. కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడితే.. ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన టాప్ టెన్ ప్లేయర్ల టిస్ట్ లో చేరతాడు. ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బ్యాట్స్ మెన్ గానూ నిలుస్తాడు. భారత్ నుంచి ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. 664 మ్యాచ్ లతో సచిన్ అందరి కంటే మొదటిస్థానంలో ఉండగా...ధోనీ 538 మ్యాచ్ లతో, రాహుల్ ద్రావిడ్ 509 మ్యాచ్ లతో ఉన్నారు. విరాట్ వయసును బట్టి అతను మరికొంత కాలం ఆడతాడు కాబట్టి థోనీ, రాహుల్ ద్రావిడ్ లను ఈజీగా దాటే ఛాన్స్ ఉంది.

అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది మాత్రం మన సచిన్ టెండూల్కరే. సచిన్ తర్వాత 652 మ్యాచ్‌లతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నాడు. శ్రీలంక మాజీ ప్లేయర్స్ కుమార్ సంగక్కర (594), సనత్ జయసూర్య (586) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ (560) ఐదవ స్థానంలో ఉండగా.. ఎంఎస్ ధోనీ (538) టాప్ 6లో కొనసాగుతున్నాడు. టాప్ 10లో రాహుల్ ద్రావిడ్ ఉన్నారు.



Tags:    

Similar News