JCB డ్రైవర్​కు​ సాహిత్య అకాడమీ అవార్డ్​..

JCB డ్రైవర్​కు​ సాహిత్య అకాడమీ అవార్డ్​..

By :  Lenin
Update: 2023-07-24 03:03 GMT


చదువుకోవాలని ఉన్నా పేదరికంతో ఆ చదువుని మధ్యలోనే ఆపేశాడు. 12 వ తరగతి వరకు చదివిన ఆ యువకుడు.. కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కూలీ పనులకు వెళ్లాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆ కుటుంబం కోసం తనకు తెలిసిన ప్రతీ పని చేశాడు. పేపర్ వేయడం, మెకానిక్ పని చేయడం, డ్రైవర్ పని.. ఇలా ఏదీ దొరికితే అది. ఇక జేసీబీ ఆపరేటర్​గా పని దొరికాక.. చదువుపై ఉన్న మమకారంతో ఖాళీ సమయాల్లో రచనలు చేశాడు. తన కలానికి పదును పెట్టి మేటి రచనలు చేసి ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అవార్డ్​కు ఎంపికయ్యాడు. కేరళకు చెందిన యువ రచయిత అఖిల్ స్టోరీ ఇది.

అఖిల్ తన కుటుంబ పోషణ కోసం చదువును మధ్యలోనే ఆపేసినా.. సాహిత్యంపై తనకున్న మక్కువతో ఖాళీ సమయాల్లో మాతృభాష మలయాళంలో రచనలు చేసేవాడు. అతని రచనలకు కేరళ సాహిత్య అకాడమీ పరిధిలోని గీతా హిరణ్య ఎండోమెంట్ అవార్డ్​-2022 వరించింది. 2020లో ప్రచురితం అయిన చిన్న కథల సంకలనం 'నీలచడయాన్‌'కు ఈ అవార్డ్​ వచ్చింది. ఈ అవార్డుతో జీవిత అనుభవాల నుంచి గొప్ప పుస్తకాలు పుట్టుకొస్తాయని నిరూపించాడు కన్నూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల అఖిల్​. జేసీబీ ఆపరేటర్ గా పని చేసే సమయంలో ఒంటరితనాన్ని అధిగమించేందుకు సమాజంలో నుంచి గ్రహించిన విషయాల ఆధారంగా తనలో తాను కథలు ఊహించుకునేవాడినని అఖిల్ వెల్లడించారు. తన జీవితంలో చాలా మందిని కలిశానని.. వారి అనుభవాలను, ఇతర అంశాలను గ్రహించానని ఆయన చెప్పుకొచ్చారు. రాత్రి సమయాల్లో ఇసుక తవ్వేందుకు వెళ్లి.. అర్థరాత్రి వరకు అక్కడే పని చేసేవాడినని.. ఖాళీ దొరికితే కలానికి పని చెప్పేవాడినని తెలిపాడు.

తన రచనలను పబ్లిష్​​ చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ఫేస్​బుక్​లో ఓ ప్రకటన చూసి.. కూలీ కెళ్లి దాచుకున్న రూ.20,000 చెల్లించి ఓ పుస్తకం(''నీలచడయాన్‌'' ) పబ్లిష్​ చేశానని చెప్పాడు. కానీ ఆ పుస్తకాలు ఆన్​లైన్​లోనే అమ్మకాలు జరిగాయని.. బుక్​స్టోర్​లో అందుబాటులో ఉండేవి కావని వెల్లడించాడు. దీంతో ఆ పుస్తకం సమాజంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అఖిల్​ వివరించారు. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ప్రముఖ సినిమా రచయిత బిపిన్ చంద్రన్ చదివారని.. అనంతరం దానిపై ఫేస్​బుక్​లో పాజిటివ్​గా స్పందిస్తూ పోస్ట్​ పెట్టారని అఖిల్​ వెల్లడించారు. దీంతో 'నీలచడయాన్‌' పుస్తకానికి బాగా ప్రాచుర్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత చాలా మంది బుక్​స్టోర్​లలో 'నీలచడయాన్‌' పుస్తకం కోసం ఆరా తీశారని.. దీంతో పబ్లిషర్లు తన పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చారని అఖిల్​ తెలిపారు.

Kerala Sahitya Akademi winner who drives an excavator by day

Kerala Sahitya Akademi winner , drives an excavator by day, backhoe loader operator , Akhil K , hinterlands of Kannur, the 28-year-old’s mind , Kerala Sahitya Akademi 2022 awards,Neelachadayan, Paravanthatta village, 

Tags:    

Similar News