ఆదాయం పెంచుకునే ప్లాన్.. యూజర్లకు ఎయిర్టెల్, జియో షాక్?
ఎయిర్టెల్, జియో సంస్థలు తమ ఆదాయం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ధరలు పెంచి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే తమదైన వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. తమ ప్లాన్ ధరలను పెంచడం ద్వారా ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్యాకేజీ ధర పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి దానిద్వారా అధిక ధరలు కల ప్యాకేల వైపు వినియోగదారులను మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కాగా మార్కెట్ లో జియోతో పోల్చితే ఎయిర్ టెల్ ప్లాన్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. మొదటి నుంచి ఎయిర్ టెల్ ఆ కంపెనీ ARPUను పెంచుకుంటూ వస్తోంది. కానీ జియో సగటు ఆదాయం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. దీనివల్ల డేటా యూసేజ్ పెరుగుతుంది. అలా లాభం పొందొచ్చని జియో అనుకుంటోంది. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తవగానే.. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మార్కెట్ వాటా పరంగా జియో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్లాన్ల పరంగా చూసుకుంటే.. ఎయిర్ టెల్ బేసిక్ ప్లాన్ రూ.208 ఉండగా.. జియో రూ.182, వొడాఫోన్ ఐడియా రూ.145గా ఉంది.