లోక్‌సభ రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్

Byline :  Kiran
Update: 2024-03-28 06:14 GMT

12 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతల్లోని 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 4 వరుకు నామిషన్ దాఖలు చేయొచ్చు. జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 6న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానం కూడా ఉన్నది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తారు.అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ జరుగనుంది.

ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్‌ 4 వరకు గడువు ఉంది. జమ్ముకశ్మీర్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 5న నామినేషన్ల స్క్యూటినీ నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో ఏప్రిల్ 6న స్క్రూటినీ ఉంటుంది.వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. కాగా, మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి.

Tags:    

Similar News