ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సద్గురు

Byline :  Shabarish
Update: 2024-03-27 12:06 GMT

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, శివ భక్తుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ మధ్యనే బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. సద్గురు మెదడులో రక్తస్రావం, వాపు కారణంగా వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. మెదడు నుంచి గ‌డ్డ‌క‌ట్టిన‌ రక్తాన్ని తొలగించేందుకు మార్చి 17న ఆయ‌న‌కు డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్ర‌స్తుతం సద్గురు ఆరోగ్య‌ పరిస్థితి మెరుగయ్యింది.

దీంతో న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ నుండి ఆయ‌న‌ నేడు డిశ్చార్జ్ అయ్యారు. సద్గురు తన ఆరోగ్య విషయాలను ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. ఈమధ్యనే ఆయన ఆస్పత్రిలో బెడ్‌పై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా సద్గురు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News