ఆ డబ్బులన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి ..మంత్రి అతిషి

By :  Vinitha
Update: 2024-03-23 07:14 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఆప్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆ పార్టీ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు రూ.100 కోట్లు అందినట్లు చెబుతున్న ఈడీ ఎలాంటి ఆధారాలను చూపించలేదని చెప్పారు. అసలైతే ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడన్నారు. అయితే ఈ కేసులో అరెస్టులు జరుగుతున్న టైంలోనే బాండ్స్ కొనుగోలు చేయడాన్ని తీసుకువచ్చారు. అయితే ఆయన అరెస్ట్ కూడా నాటకీయంగానే జరిగిందని ఆరోపించారు. నెలల తరబడి జైలులో ఉన్న శరత్ తన స్టేట్ మెంట్ మార్చారని చెప్పారు. ఈ కేసులో కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడానని స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాతే ఆయనకు బెయిల్ మంజూరైందని అప్పటి వరకు కస్టడీలోనే ఉన్నారన్నారు. గతంలోనే ఆయన కేజ్రీవాల్, ఆప్ తో తనకెలాంటి సంబంధంలేదని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

అయితే ఆయన ఈ విషయం చెప్పిన మరుసటి రోజే శరత్ ను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో అరబిందో ఫార్మా కంపెనీ సుమారు రూ.52 కోట్ల విలువైన ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసిందన్నారు. ఇందులో ఎక్కువ భాగం అంటే 66 శాతం నిధులు బీజేపీకే అందాయని మంత్రి అతిషి చెప్పారు.

Tags:    

Similar News