రెండు వేల నోట్లుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా కీలక ప్రకట చేసింది. ఏప్రిల్1వ తేదీన రూ.2000 నోట్లను తీసుకోమని స్పష్టం చేసింది. ఆ రోజున వార్షిక ఖాతల ముగింపు ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. . మళ్లీ ఆ సర్వీస్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐకి చెందిన 19 కేంద్రాల వద్ద ప్రస్తుతం రెండువేల నోట్ల మార్పిడి జరుగుతున్నది.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సుమారు 97.2 శాతం చెలామణిలో ఉన్న రెండు వేల నోట్లు వాపస్ వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. సర్క్యులేషన్ నుంచి రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయ్‌పూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద రెండు వేల నోట్ల ఎక్స్‌చేంజ్ నడుస్తున్నది.