తమిళనాడు ఎంపీ సూసైడ్ అటెంప్ట్..చికిత్స పొందుతూ మృతి

Byline :  Vamshi
Update: 2024-03-28 05:51 GMT

తమిళనాడు ఈ రోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మరణించారు. ముడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం హార్ట్ ఎటాక్ వచ్చింది. కోయంబత్తూర్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 2019లో ఎం‌డీఎంకే తరుపున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈ సారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి24న పురుగు మందు తాగారు. తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే టికెట్ మీద ఎంపీగా గణేశ్ మూర్తి గెలిచారు.

అనంతరం ఆయన పార్టీని వీడి వైగోకు చెందిన ఎండీఎంకేలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆయన ఎండీఎంకేలోనే కొనసాగుతున్నారు. ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి మరణ వార్త తెలుసుకున్న తమిళనాడు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్‌ ముత్తుసామి, మోదకురిచ్చి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీ సరస్వతి, అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం సహా పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఎంపీ గణేశమూర్తి మృతి పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలైతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News