నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3

Update: 2023-07-14 09:19 GMT

సరిగ్గా అనుకున్న సమయానికే చంద్రయాన్ -3 నింగిలోకి ఎగిసింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట నుంచి రాకెట్ లో ఆకాశంలోకి దూసుకెళ్ళింది. రాకెట్ ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. నింగిలోకి దూసుకెళ్ళిన రాకెట్ ప్రొపల్షన్ మిషన్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోను అందరూ అభినందిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం భారతీయులకు గర్వకారణమని....దీనికి సహకరించిన శాస్త్రవేత్తలు, వారికి అండగా నిలిచిన అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా చంద్రయాన్ -3 లాంచింగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తోంది. 3,900 కిలోల బరువున్న చంద్రయాన్ -3 ల్యండర్, రోవర్ లను మోసుకెళుతోంది.

కాగా ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్‌లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు.

పీఎస్ఎల్వీ రాకెట్‌ చంద్రయాన్‌-3 ని భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఇది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరుస్తారు. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు. దీని కోసం మధ్యలో చాలా ప్రక్రియలు దాటుకుంటూ వెళ్ళాలి. అన్నీ అనుకున్నట్టు సక్రమంగా జరిగితే ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ విడిపోయి.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగనుందని ఇస్రో వెల్లడించింది. ఒకవేళ ఆ సమయానికి జరగకపోతే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News