బంగ్లాదేశ్ క్రికెటర్ల మరోసారి అతి ప్రదర్శించారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఆ జట్టు 2-1 తేడాతో గెలిచింది. దీంతో ట్రోఫి అందుకునే సమయంలో బంగ్లా ఆటగాడు ముష్పీకర్ రహీమ్ హెల్మెట్ తీసి అంపైర్లతో వాదిస్తున్నట్లుగా కెమెరా ముందుకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు.స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్.. పర్యాటక జట్టుకు షాకిచ్చింది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లా పులులు.. వన్డేలలో మాత్రం 2-1 తేడాతో లంకేయులపై గెలిచారు.
చిత్తోగ్రమ్ వేదికగా సోమవారం ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్.. 40.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ తాంజిద్ హసన్ (81 బంతుల్లో 84, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు రిషద్ హోసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో బంగ్లా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ గెలుచుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక టాపార్డర్ విఫలమైంది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్‌లు విజృంభించడంతో ఆ జట్టు ఒక దశలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ జనిత్ లియాంగె (101 నాటౌట్) సెంచరీతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు