RCB Team : ఈ సారి టైటిల్ గెలిచేది ఆ జట్టే..మాజీ క్రికెటర్ జోస్యం

Byline :  Vinitha
Update: 2024-03-10 07:17 GMT

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలుకానుంది. మొత్తం 10 జట్లు టైటిల్ వేటలో ఉన్నాయి. టైటిల్ ను చేజేతులా పట్టుకోవాలని ప్రతి ఒక్క జట్టు ఆశిస్తుంది. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఆర్సీబీకి ఐపీఎల్ లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు పదాహారేండ్లుగా ఈ జట్టు టైటిల్ ను ముద్దాడేందుకు ఊవిళ్లురుతోంది. లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోయినప్పటికీ..అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్‌ చేస్తూనే ఉంటారు.




 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కావడానికి ముందు నుంచే ఈ సాలా కప్ నమ్దే అంటూ హాడావిడి చేస్తుంటారు. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్‌-2024కు ప్రారంభం కానుండడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు సంబంధించి కామెంట్స్ చేశాడు. ఈ సారి ఐపీఎల్‌ కప్ ఆర్సీబీని వరిస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఈ సారి జట్టు పటిష్టంగా కనబడుతోందని చెప్పాడు. అంతేగాక జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారని..ఆఖరి వరకు బ్యాటింగ్ లైనప్ బాగుందని తెలిపాడు. అందువల్ల ఆర్సీబీ టైటిల్ ఫేవరేట్ అనడంతో సందేహం లేదని...ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్నట్లు ఇర్ఫాన్ చెప్పాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.




 




Tags:    

Similar News