india vs England : ధర్మశాల టెస్ట్‌లో భారత్ ఘన విజయం..4-1తో సిరీస్ సొంతం

Byline :  Shabarish
Update: 2024-03-09 09:08 GMT

ధర్మశాల వేదికగా సాగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఐదో టెస్ట్ ఇన్నింగ్స్‌లో 64 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టును 195 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్ 84 అత్యధిక పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 39, టామ్ హార్డీ 20, జాక్‌క్రాలీ 0, బెన్‌డకెట్ 2, బెన్ స్టోక్స్ 2, ఓలీపోప్ 19 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యారు.




 


ఇకపోతే భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, బుమ్రా చెరో రెండు వికెట్లను పడగొట్టారు. రవీంద్ర జడేజా ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 477 పరుగులతో భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక చివరికి భారత్‌కు 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లను పడగొట్టాడు.




 


టెస్టుల్లో ఆండర్సన్ 700వ వికెట్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటుగా బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించారు. రోహిత్ శర్మ 103, గిల్ 110 పరుగులు చేయడంతో భారత్‌కు విజయం సాధ్యమైంది. సొంతగడ్డపై భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్‌ను కైవశం చేసుకుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుని మరోసారి సత్తా చాటింది.


Tags:    

Similar News