నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచేన్ ను నేపాల్ క్రికెట్ బోర్డ్ గురువారం (జనవరి 11) సస్పెండ్ చేసింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం కేసులు నిందితునిగా ఉన్న సందీప్ కు.. బుధవారం (జనవరి 10) ఖాట్మండ్ జిల్లా కోర్ట్ 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయంలో నిందితునిగా పరిగణించబడినందుకు సందీప్ ను.. నేపాల్ బోర్డ్ సస్పెండ్ చేసింది. సందీప్ ను సస్పెండ్ చేసిన కారణంగా అతను ఎలాంటి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో పాల్గొనేందుకు వీలు లేదని ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో సందీప్ పూర్తిగా క్రికెట్ కు దూరం కానున్నాడు. సందీప్ గతంలో నేపాల్ టీంకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
దోషిగా రుజువైన కారణంగా ఖాట్మండు కోర్ట్ సందీప్ కు రూ.3 లక్షల జరిమానా విధించింది. వీటితో పాటు బాధితురాలికి రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్ 21, 2022లో తిల్ గంగాలోని ఓ హోటల్ లో సందీప్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరం రుజువైన కారణంగా.. 2017 జాతీయ శిక్షా స్మృతి చట్టం కింద చర్యలు తీసుకుంది. అతనిపై సెక్షన్ 219లోని సబ్ సెక్షన్ 3 (డి) 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా సందీప్ నేపాల్ తరుపున 103 మ్యాచ్ లు ఆడగా.. 210 వికెట్లు పడగొట్టాడు. 2018-20లో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 9 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు.
Cricket Nepal has issued a statement regarding Sandeep Lamichhane's coercion case, suspending him from domestic and international sports activities. pic.twitter.com/pcKiyo3awp
— CricTracker (@Cricketracker) January 11, 2024