ఆఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. సౌతాఫ్రికాపై రెండో టెస్టులో ఘన విజయం సాధించి ఉత్సాహం మీదున్న భారత్.. స్వదేశంలో అఫ్గాన్తో తలపడనుంది. జవనరి 11 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. సుమారు 14 నెలల తర్వాత ఈ ఇద్దరూ ఇంటర్నేషనల్ టీ20ల్లో రీఎంట్రీ ఇస్తున్నారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో వీరిద్దరూ చివరి సారిగా ఆడారు.
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో వీడే ఆడే అవకాశాలున్నాయి. కాగా కోహ్లీ, రోహిత్ రీఎంట్రీపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సిరీస్ కు స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతినివ్వగా.. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యారు.
భారత జట్టు : రోహిత్ శర్మ (సి), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్