కావాల్సింది మరో 37 పరుగులే.. కోహ్లీ రికార్డ్పై కన్నేసిన జైస్వాల్
వయసు 21 ఏళ్లే. ఆడేది ఓపెనర్ గా.. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్ ను అద్భుతంగా మొదలుపెడతాడు. మొదటి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. సెలక్టర్లు తొందరపడ్డారని విమర్శకుల నోళ్లకు పని చెప్పే పనులు ఏనాడూ చేయలేదు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు అతని ప్రదర్శన ఉంటుంది. చూడ్డానికి కరెంట్ తీగలాగ సన్నగానే ఉంటాడు. కానీ కొడితే ప్రతీ బాల్ బౌండరీ అవతలే ఉంటుంది. కష్టాల్లో ఉన్న ప్రతిసారి జట్టును ఆదుకుంటున్నాడు. లోన్ వారియర్‌లా ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు సాధిస్తూ యోధుడిలా పోరాడుతున్నాడు. అతనే యంగ్ హీరో యశస్వీ జైస్వాల్.
బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు (209, 214 నాటౌట్) బాది ఇన్ ఫామ్ లో ఉన్న జైస్వాల్.. కీలక నాలుగో టెస్టులో కూడా తన ఫామ్ ను కొనసాగించాడు. 7 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు చేశాడు. కాగా ఈ సిరీస్ తో జైస్వాల్.. విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేశాడు. కోహ్లీ, ద్రవిడ్, విజయ్ మంజ్రేకర్ లాంటి దిగ్గజాల సరసన నిలిచే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సిరీస్ ఇప్పటివరకు 618 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్న జైస్వాల్ 37 పరుగులు చేస్తే కోహ్లీని దాటేస్తాడు. అదేంటంటే.. ఒక టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ (655)ను జైస్వాల్ అదిగమిస్తాడు. భారత్ కు ఇంకో మ్యాచ్ తో పాటు, మరో ఇన్నింగ్స్ మిగిలి ఉండటంతో ఈ రికార్డ్ బద్దలవుతుందని విశ్లేషకులు అంటున్న మాట.
ఈ లిస్ట్లో:
• విరాట్ కోహ్లీ: 2016/17 సిరీస్‌లో 655 పరుగులు
• యశస్వి జైస్వాల్: 2023/24 సిరీస్‌లో 618* పరుగులు
• రాహుల్ ద్రవిడ్: 2022 సిరీస్‌లో 602 పరుగులు
• విరాట్ కోహ్లీ: 2018 సిరీస్‌లో 593 పరుగులు
• విజయ్ మంజ్రేకర్: 1961/62 సిరీస్‌లో 586 పరుగులు