IND vs ENG: టీమ్ ఇండియా ఆలౌట్ .. సెంచరీ మిస్ చేసుకున్న జురెల్
IND vs ENG: టీమ్ ఇండియా ఆలౌట్ .. సెంచరీ మిస్ చేసుకున్న జురెల్
రాంచీ వేదికగా భారత్,ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకే అలౌట్ అయింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఒడ్డునపడేశాడు. రెండో రోజే 219 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మూడో రోజు ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) కొద్దిసేపు నిలకడగానే ఆడారు. అయితే ఇన్నింగ్స్ 88వ ఓవర్‌లో ఇంగ్లిష్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేసిన 3వ బంతికి కుల్‌దీప్ (28) ఔటయ్యాడ్. అండర్సన్ వేసిన బంతి కుల్‌దీప్ బ్యాట్ ఇన్‌సైట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో జురెల్, యాదవ్ పార్టనర్ షిప్ కి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్(9) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివరి వరకూ పోరాడిన ధ్రువ్ జురెల్( 90) కెరీర్‌లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.
Dhruv Jurel putting up a show here in Ranchi! 👌 👌
— BCCI (@BCCI) February 25, 2024
He moves into 90 as #TeamIndia sail past 300 👏 👏
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zYp9At55JX
భారత బ్యాటర్లలో జురెల్ 90, జైస్వాల్ 73, గిల్ 38 పరుగులు చేశారు. రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ (2), రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), రవిచంద్రన అశ్విన్ (1) విఫలమయ్యారు. ఒకదశలో ఆలౌట్ ప్రమాదంలో పడిన జట్టును జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5, హార్ట్‌లీ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టి.. 46 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది.