టీమిండియాలో ఎవరినేమన్నా సరే.. విరాట్ జోలికి వెళ్లొద్దు: ఇంగ్లాండ్ మాజీ బౌలర్

By :  Bharath
Update: 2024-01-11 11:43 GMT

జనవరి 25 నుంచి భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్‌ కీలక సూచనలు చేశాడు. విరాట్ కోహ్లీ జోలికి అస్సలు వెళ్లొద్దని, గతంలో జరిగిన స్టెడ్జింగ్ ఘటనను గుర్తుచేసుకోవాలని సూచించాడు. మునుపటిలా కాదు.. ఇప్పుడు భారత్ చాలా గొప్పగా ఉంది. ఎవరితో చేసినా పర్లేదుడ కానీ.. విరాట్ కోహ్లీని రెచ్చగొట్టొద్దు. 2012 పర్యటనలో సిరీస్ ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో టీమిండియాపై గెలిచినా.. కోహ్లీ సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేసుకోండని చెప్పాడు.

‘అందుకే కోహ్లీని ఒక్క మాట కూడా అనకండి. అప్పట్లో మన బౌలర్ స్టీఫెన్ ఫిన్ బౌలింగ్ లో అద్భుతమైన బౌడరీలు కొట్టాడు. దీంతో ఫిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అతను చేసిన పొరపాటు ఏంటనేది తెలుసుకున్నాడు. అతనిపై కోహ్లీ పులిలా విరుచుకుపడ్డాడు. ఆ సిరీస్ లో ఫిన్ పై ప్రతీ మ్యాచ్ లో కోహ్లీ విరుచుకుపడ్డాడు. భారీగా పరుగులు రాబట్టాడ’ని స్వాన్ చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News