2024లో కొనాల్సిన స్మార్ట్ఫోన్.. కళ్లతోనే కంట్రోల్ చేయొచ్చు

Byline :  Bharath
Update: 2024-02-29 14:52 GMT

1996లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా మాటిల్డా చూశారా? ఇందులో మారావిల్సన్ తన కళ్లతో అన్ని వస్తువులను లిఫ్ట్ చేస్తుంది. అచ్చం అలానే నిజ జీవితంలో జరిగితే? దాన్ని నిజం చేస్తుంది చైనీస్ టెక్ కంపెనీ హానర్. కొత్తగా లాంచ్ చేసిన Honor Magic 6 Pro స్మార్ట్ ఫోన్ సాయంతో మన కంటి చూపుతో ఏదైనా కదిలించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇవన్నీ సాధ్య పడతాయి. స్పెయిన్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో..ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది. కంటితో వస్తువులను ఎలా ట్రాక్ చేయాలనేది చిన్న డెమో ఇచ్చింది. ఇందులోని ఏఐ టెక్నాలజీతో కార్ లాక్ ఓపెన్ చేయొచ్చు. డ్రైవ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఇవన్నీ కేవలం కంటి చూపుతోనే చేయొచ్చని కంపెనీ తెలిపింది.

ఇక ఫోన్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. Honor Magic 6 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. 12GB, 512 GB, 16 GB RAM , 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇది 6.8 అంగుళాల 120Hz 1280p LTPO AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇందులో ఉన్నాయి. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, OIS sy pcrl 180 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. కాగా దీని ధర రూ.1,16,600 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1 నుంచి సేల్స్ లోకి వస్తుంది.

Tags:    

Similar News