ISRO : భారత్‌లో మరో అంతరిక్ష ప్రయోగ కేంద్రం

Byline :  Shabarish
Update: 2024-02-28 10:51 GMT

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరిన్ని రాకెట్లను లాంచ్ చేయనుంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్పీడ్ పెంచిన ఇస్రో గత ఐదేళ్లలో స్పేస్ రంగంలో సరికొత్త మార్పులతో దూసుకుపోతోంది. ప్రతి ఏడాది ప్రయోగాల సంఖ్యను పెంచుతూ వెళ్తోంది. తాజాగా ఇస్రోకు సంబంధించి మరో ప్రయోగ కేంద్రాన్ని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. భారత్ నుంచి అంతరిక్ష ప్రయోగం చేపట్టాలంటే అందరికీ శ్రీహరికోట మాత్రమే గుర్తుకొచ్చేది. అయితే ఇప్పుడు మరో స్పేస్ సెంటర్ సిద్ధం కానుంది. త్వరలోనే ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అందుబాటులోకి రానుంది.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నంలో సుమారు 2233 ఎకరాల స్థలంలో నూతన షార్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.950 కోట్ల వ్యయంతో పరిశోధన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ చూస్తే ఇస్రో PSLV, GSLV, MARK 3 లాంటి అంతరిక్ష వాహక నౌకలను మాత్రమే ప్రయోగిస్తూ వస్తోంది. ఆ ప్రయోగాలకు భారీగా డబ్బు, సమయం వృధా అవుతోంది. అయితే ఆ ఖర్చును, సమయాన్ని తగ్గించుకునేందుకు ఇస్రో సరికొత్త వాహక నౌక(రాకెట్) లను తయారు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేసింది.

అన్ని ప్రయోగాలను శ్రీహరికోట నుంచే లాంచ్ చేయడం సాధ్యం కాకపోవడం వల్ల మరో స్పేస్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రం అడుగులు వేసింది. అలాగే అమెరికా తరహాలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రయివేటు సెక్టార్లను కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ప్రైవేటు సంస్థలకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త తరహా ప్రయోగాలకు, ప్రైవేటు సంస్థలు చేసే చిన్న చిన్న రాకెట్ల ప్రయోగాలకు కులశేఖర పట్నం వేదిక కానుందని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News