మార్కెట్లోకి వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్.. బుకింగ్స్ ప్రారంభం

By :  Shabarish
Update: 2024-03-01 09:40 GMT

భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్ వచ్చేసింది. ఫిబ్రవరి 26న వన్‌ప్లస్ వాచ్2 పేరుతో ఇది మార్కెట్లోకి విడుదలైంది. వాచ్2 గూగుల్ వేర్ ఓఎస్ 4తో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ వాచ్ కావాలనుకునేవారు కేవలం రూ.99తో ప్రీ బుక్సింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.2000 వరకూ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే ప్రీ బుల్లెట్ వైర్‌లెస్ జెడ్2 ఇయర్ బడ్స్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ వాచ్ 1.43 ఇంచెస్ ఎఎంఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో Qualcomm snapdragon W5 Gen 1 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 గంటల వరకూ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. వన్‌ప్లస్ వాచ్2 రౌండ్ డయల్‌తో రానుంది. ఈ వాచ్‌కు లెఫ్ట్ సైడ్ 2 బటన్లు ఉంటాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్ లాంచ్‌కు ఇంకా సమయం ఉంది. అయితే ఫీచర్లు మాత్రం లీకయ్యాయి. 402mAh బ్యాటరీతో పాటు IP68 రేటింగ్ అందుబాటులో ఉంది.

వన్‌ప్లాస్ స్మార్ట్ వాచ్2 వాటర్, డస్ట్ నుంచి రక్షణగా ఉంటుంది. అలాగే ఇందులో 1జీబీ ర్యామ్, 4జీబీ స్టోరేజీ, గూగుల్ వియర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌‌కు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కేవలం రూ.99తో ప్రీ బుక్సింగ్ చేసుకునే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో రూ.24,999కి కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ.27,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్ కింద దీనిపై రూ.3 వేల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐసీఐసీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.2 వేల వరకూ అదనపు డిస్కౌంట్ లభించనుంది.


Tags:    

Similar News