Asia Cup 2023: ఒకరికి గాయం.. మరొకరికి జ్వరం.. ఆసియా కప్కు కీలక ఆటగాళ్లు దూరం

Byline :  Bharath
Update: 2023-08-30 13:27 GMT

ఆసియా కప్2023కి ప్రారంభానికి ముందు ప్రతీ జట్టుకు ఎదురుదెబ్బ తగులుతోంది. గాయాలు, రోగాలతో కీలక ఆటగాళ్లు టీంలకు దూరం అవుతున్నారు. టీమిండియా ఆడే మొదటి మ్యాచ్ లకు ఇప్పటికే కేఎల్ రాహుల్ దూరం అయిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ కోలుకున్నా.. అతన్ని ఆడిస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఆసియా కప్ కు దూరం అయ్యారు. టోర్నీకి ముందు బంగ్లా పేసర్ ఎబాదత్ హొస్సేన్ ఆసియా కప్ తో పాటు ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు.




 


ఇదిలా ఉండగా స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. దీంతో ముందు జాగ్రత్తగా బంగ్లా క్రికెట్ బోర్డ్ అన్ మోల్ హక్ ను ఎంపిక చేసింది. ఇటీవల ఆఫ్గనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడ్డ ఎబాదత్ కు ఆరు వారాల రెస్ట్ ఇవ్వాలని ఫిజియే సూచించాడు. అయినా గాయం తగ్గకపోతే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. కాగా బంగ్లాదేశ్ గురువారం (ఆగస్టు 31) క్యాండీలోని పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరగబోయే తొలి మ్యాచ్ తో బరిలోకి దిగుతుంది.




 








Tags:    

Similar News