ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన మహమ్మద్ షమీ

By :  Bharath
Update: 2024-02-22 11:16 GMT

ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. ఆ కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే గాయం కారణంతో ఆయన ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. కాగా యూకేలో శస్త్రచికిత్స చేయించుకునేందుకు షమీ బయలుదేరనున్నాడు. దాన్నుంచి కోలుకునేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందట. షమీ వన్డే వరల్డ్ కప్ ముందు నుంచే చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. అయితే హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో వరల్డ్ కప్ మధ్యలో అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు.

ఆ గాయం తిరగబడి వేధిస్తున్నా టోర్నీలో షమీ అద్భుతంగా రాణించాడు. ఆ గాయం నుంచి కోలుకునేందుకు మిగతా సిరీస్లకు దూరమయ్యాడు. అతని గాయం ఎంతకీ తగ్గకపోవడంతో.. సర్జరీ కోసం యూకే పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ సర్జరీ టీమిండియాకు కోలుకోలేని దెబ్బే. ఐపీఎల్ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లతో పాటు టీ20 వరల్డ్ కప్ కు కూడా షమీ దూరం కానున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్- గవాస్కర్ ట్రీఫీకి షమీ తిరిగి రావొచ్చని బీసీసీఐ తెలిపింది.



Tags:    

Similar News