IND Vs ENG : ముగిసిన మూడోరోజు ఆట.. భారత్ గెలుపుకు ఎన్ని రన్స్ కావాలంటే..?

By :  Krishna
Update: 2024-02-25 12:23 GMT

రాంచీ వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్ గెలుపుకు దగ్గరైంది. టీమిండియా గెలుపుకు ఇంకా 152 రన్స్ మాత్రమే కావాలి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 40/0 గా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 145 రన్స్కే ఆలౌట్ కావడంతో మొత్తం 191 లీడ్ సాధించింది. 192 టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రోహిత్ శర్మ 24, జైశ్వాల్ 16 రన్స్తో క్రీజులో ఉన్నారు.

మొత్తం ఐదో వన్డేల సిరీస్లో టీమిండియా ఇప్పటికే రెండింటిలో గెలిచింది. ఈ టెస్టులోనూ గెలిస్తే సిరీస్ మనదే. అంతకుముందు భారత స్పినర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ముగ్గురు బ్యాటర్లు డగౌట్ అవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. జాక్ క్రాలీ 60, బెయిర్ స్టో (30) పరుగులతో రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అదేవిధంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకే అలౌట్ అయింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) ఒత్తిడిలోనూ 90 రన్స్తో రాణించాడు.10 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ చేజార్చుకున్న‌ప్ప‌టికీ విలువైన ఇన్నింగ్స్‌తో జ‌ట్టును ఒడ్డున‌ప‌డేశాడు. 219 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం ఆటను ప్రారంభించిన టీమిండియా 307 రన్స్ చేసింది. ధ్రువ్‌ జురెల్ (Dhruv Jurel)‌, కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) కొద్దిసేపు నిలకడగానే ఆడారు. అయితే ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో జేమ్స్‌ అండర్సన్‌ వేసిన 3వ బంతికి కుల్‌దీప్‌ (28) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్(9) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివరి వరకూ పోరాడిన ధ్రువ్‌ జురెల్‌( 90) కెరీర్‌లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.

భారత బ్యాటర్లలో జురెల్‌ 90, జైస్వాల్‌ 73, గిల్‌ 38 పరుగులు చేశారు. రాజ్‌కోట్ టెస్టులో సెంచ‌రీ బాదిన‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2), రజత్‌ పాటిదార్‌ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), రవిచంద్రన అశ్విన్‌ (1) విఫలమయ్యారు. ఒకద‌శ‌లో ఆలౌట్ ప్ర‌మాదంలో ప‌డిన జ‌ట్టును జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

Tags:    

Similar News