Video : హెల్మెట్ లేకుండా సర్ఫరాజ్ ఫీల్డింగ్.. రోహిత్ ఏమన్నాడంటే..?

By :  Krishna
Update: 2024-02-25 14:44 GMT

రాంచీ వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్ గెలుపుకు ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 40/0 గా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 145 రన్స్కే ఆలౌట్ కావడంతో మొత్తం 191 లీడ్ సాధించింది. 192 టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రోహిత్ శర్మ 24, జైశ్వాల్ 16 రన్స్తో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. సర్ఫరాజ్ షార్ట్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్ మెన్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్న అతుడ హెల్మెట్ పెట్టుకోలేదు. దీనిన గమనించిన రోహిత్.. హెల్మెట్ పెట్టుకోవాలని సూచించాడు. ‘‘తమ్ముడూ హీరో అవ్వాలనుకోవద్దమ్మా..ముందు హెల్మెట్ పెట్టుకో ’’ అంటూ సరదాగా అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత స్పినర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ముగ్గురు బ్యాటర్లు డగౌట్ అవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. జాక్ క్రాలీ 60, బెయిర్ స్టో (30) పరుగులతో రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Tags:    

Similar News