ఇంగ్లాండ్ జట్టులో మార్పు.. గెలుపే లక్ష్యంగా ఆ ఇద్దరికి పిలుపు
భారత పర్యటనను ఘనంగా ప్రారంభించిన ఇంగ్లాండ్ కు వరుస ఓటములు షాకిచ్చాయి. దీంతో రేపటి నుంచి (ఫిబ్రవరి 23) రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టు ఇంగ్లాండ్ కు చావోరేవో లాంటిది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మరింత బలమైన జట్టును రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. నాలుగో టెస్టుకు మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ లను తప్పించి.. ఫామ్ లో పేసర్ ఓలీ రాబిన్సన్, యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ లను జట్టులోకి తీసుకోవాలని భావిస్తుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించి విజయం సాధించిన ఇంగ్లాండ్.. తర్వాత ఫెయిల్ అయింది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణ వైఫల్యానికి వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో ఓడిపోయింది. ఈ సిరీస్ లో కీలకమైన రాంచీ టెస్టులో గెలుపే లక్ష్యంగా స్టోక్స్ సేన సిద్ధమవుతుంది.
గతేడాది జరిగి మోకాలి సర్జరీ కారణంగా కేవలం బ్యాటింగ్ కే పరిమితమైన స్టోక్స్.. రేపటి మ్యాచ్ లో బౌలింగ్ వేసే అవకాశముంది. రాంచీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో.. టీమిండియా మరింత బలంగా స్పిన్నర్లను దింపే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హర్ట్లే, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.