రాహుల్ ద్రావిడ్పై వేటు.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆ ఐదుగురు..!

Update: 2023-06-17 06:59 GMT

భారత అండర్ 19 జట్టును అందని తీరాలకు చేర్చి.. ఎంతో మంది యంగ్ స్టర్స్ ను పరిచయం చేశాడు రాహుల్ ద్రావిడ్. దాంతో రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు ద్రావిడ్ కు అప్పగించింది బీసీసీఐ. 10 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ ట్రోఫీని అందిస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ట్రోర్నీల్లో నిరాశ మిగిలింది. దీంతో హెడ్ కోచ్ పై వేటు వేసే ప్రయత్నంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అండర్ 19లో అదరగొట్టిన ద్రావిడ్.. అంతర్జాతీయ క్రికెట్ కు వచ్చేసరికి తేలిపోయాడు.

అయితే, ప్రస్తుతం ద్రావిడ్ కు ప్రత్యామ్నాయంగా.. ఐదుగురు హెడ్ కోచ్ ల లిస్ట్ బీసీసీఐ టేబుల్ పై ఉంది. ఆశిష్ నెహ్రా, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్, రిక్కీ పాంటింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఆశిష్ నెహ్రా, స్టీఫెన్ ఫ్లెమింగ్ లకు చాలామంది ఓటు వేశారు. ఆశిష్ నెహ్రాకు టీమిండియా ఆటగాళ్ల గురించి మొత్తం తెలుసు. వాళ్ల మెంటాల్టి, సామర్థ్యాన్ని తెలుసుకుని జట్టును తయారు చేస్తాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై జట్టుకు 5 ట్రోఫీలు అందించాడు. ఈ ఇద్దరిట్లో బీసీసీఐ ఎవర్ని ఎంచుకుంటుందో చూడాలి. అయితే, అక్టోబర్ లో జరగబోయే వరల్డ్ కప్ వరకు ద్రావిడ్ హెచ్ కోచ్ గా కొనసాగుతాడు. తర్వాత బీసీసీఐ తనను తొలగించే అవకాశం ఉంది. 

 


Tags:    

Similar News