క్రికెట్‎లో కొత్త రూల్..అలా చేస్తే 10 మందే ఫీల్డింగ్

Update: 2023-08-13 12:01 GMT

స్లో ఓవర్ రేట్..క్రికెట్ లో గత కొంతకాలంగా వినిపిస్తున్న పెద్ద సమస్య. స్లో ఓవర్ రేటు కారణంగా నిర్ణీత సమాయానికి మ్యాచ్‌ను ముగించడం వీలుకావడం లేదు. ఉదహరణకు ఇన్నింగ్స్ మొదలైన 72 నిమిషాల 15 సెకన్లలోపు 17వ ఓవర్ వేసేయాలి. 76 నిమిషాల 30 సెకన్లలోపు 18వ ఓవర్, 80 నిమిషాల 45 సెకన్లలోపు 19వ ఓవర్ పూర్తిచేసేయాలి. ఇక చివరి ఓవర్‌ను 85 నిమిషాల కల్లా ముగించేయాలి. కానీ ఇటీవల మ్యాచ్‌లు చాలా ఆలస్యంగా ముగుస్తున్నాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లకు భారీగా జరిమానాలు విధించిన ఫలితం దక్కడం లేదు. దీంతో ప్రముఖ టీ 20 లీగ్ కరీబియన్ ప్రీమిర్ లీగ్‌లో కొత్త రూల్ తీసుకొచ్చారు.




 


ఈ కొత్త రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న టీం కనుక 18వ ఓవర్‌ను సమయానికి మొదలు పెట్టలేదంటే.. థర్టీ యార్డ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్‎ను తగ్గించేస్తారు. 18వ ఓవ‌ర్ 76 నిమిషాల 30 సెక‌న్ల‌కు ముగియాలి. అలా జ‌ర‌గ‌కుంటే.. ఇద్ద‌రు అద‌నపు ఫీల్డ‌ర్ల‌ను 19వ ఓవ‌ర్ వేసే ముందు 30 యార్డుల స‌ర్కిల్‌లో ఉంచాలి. అంతేకాదు 19వ ఓవ‌ర్‌ను 80 నిమిషాల 45 సెక‌న్ల లోపు వేయకపోతే 20వ ఓవ‌ర్‌కు ముందు ఒక ఫీల్డ‌ర్‌ను మైదానం బ‌య‌ట‌కు పంపిస్తారు. దీంతో 10 మాత్రమే ఫీల్డింగ్ చేస్తారు. వారిలో ఆరుగురు ఫీల్డ‌ర్లు స‌ర్కిల్‌లోనే ఉండాలి. ఈ కొత్త నిబంధనలతో బ్యాటింగ్ టీం మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంది.

బ్యాటింగ్ టీంకి కొత్త రూల్స్ విధించారు. టైం వేస్ట్ చేయకుండా ఉండేందుకు పలు నిబంధనలను తీసుకొచ్చారు. వారు టైం వేస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తే మొదట వారికి అంపైర్లు వార్నింగ్

ఇస్తారు. వాటిని పట్టించుకోకుండా వారు ప్రవర్తిస్తే ఆ టీం టోటల్ స్కోర్‌లో ఐదు పరుగులను ఫెనాల్టీ కింద తగ్గించేస్తారు. ఇలా ఎన్నిసార్లు సమయం వృధా చేస్తారో అన్నిసార్లు ఐదు పరుగులు కోల్పోవల్సి వస్తుంది. మ్యాచ్‎ను నిర్ణీత సమయానికి ముగించడంలో ఈ కొత్త రూల్స్ కీలక పోషిస్తాయని కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు భావిస్తున్నారు.


Tags:    

Similar News