నన్ను చంపకండి.. నేను బతికే ఉన్నా.. హీత్ స్ట్రీక్

Update: 2023-08-23 07:35 GMT

జింబాబ్వే (Zimbabwe) దిగ్గజ ఆల్‌ రౌండర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) క్యాన్సర్‌తో చనిపోయినట్లు కొన్ని వెబ్ సైట్లు పిచ్చి రాతలు రాశాయి. ఇది నిజమే అనుకొని.. క్రికెట్ ప్రేమికులు ఆవేదనకు గురయ్యారు. స్ట్రీక్ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను బతికే ఉన్నానంటూ అందరికీ షాకింగ్ నిజాన్ని చెప్పారు స్ట్రీక్ . తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. తాను చనిపోయాననేది పెద్ద రూమర్ అని ఓ మీడియా సంస్థకు ఫోన్ చేసి చెప్పారు.




 


స్ట్రీక్ స్వ‌యంగా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడార‌ని, తాను ప్రాణాల‌తోనే ఉన్నట్లు ఆ సంస్థ‌తో పేర్కొన్న‌ట్లు తెలిసింది. త‌న చావుపై వ‌చ్చిన వార్త రూమ‌ర్ అని, అదో అబ‌ద్ధం అన్నారు. ఎటువంటి నిర్ధార‌ణ లేకుండా ఎలా ఒక‌రి చావు వార్త‌ను వ్యాప్తి చేస్తార‌ని హీత్ ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. త‌న చావు వార్త‌ను వ్యాప్తి చేసిన వ్య‌క్తి క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. ఆ వార్త త‌న‌ను ఎంతో బాధించిన‌ట్లు స్ట్రీక్ వెల్ల‌డించారు. హీత్ స్ట్రీక్ మ‌ర‌ణ‌వార్త‌ను పోస్టు చేసిన ఓలాంగో.. మ‌ళ్లీ కొత్త ట్వీట్ చేశారు. థార్డ్ అంపైర్ అత‌న్ని వెన‌క్కి ర‌మ్మ‌న్న‌ట్లు తెలిసింద‌ని కామెంట్ చేశారు.




 


49 ఏళ్ల హీత్ స్ట్రీక్ 31 ఏళ్ల వయసులో 2005లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టెస్టుల్లో 100కు పైగా, వన్డేల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన ఏకైన జింబాబ్వే బౌలర్ గా స్ట్రీక్ ఘనత సాధించాడు. 2000 సంవత్సరంలో ఆయన జింబాబ్వే జట్టుకు సారధ్యం వహించాడు.



Tags:    

Similar News