వరల్డ్ కప్ ట్రోఫీతో బాలీవుడ్ బాద్షా

ఈసారి కప్ భారత్‌దే అంటున్న ఫ్యాన్స్;

By :  Lenin
Update: 2023-07-20 05:51 GMT



అక్టోబర్ లో జరిగే క్రికెట్ వన్డే వరల్డ్ కప్ హడావుడి నెమ్మదిగా మొదలవుతోంది. ప్రపంచకప్ ట్రోఫీని ఐసీసీ చారిత్రాత్మకంగా ప్రారంభించింది. మెగా ట్రోఫీని స్పేస్ లో నుంచి రివీల్ చేసింది. దాని తర్వాత ఆ ట్రోఫీ వరల్డ్ టూర్ లో ఉంది. టోర్నమెంట్ లో పాల్గొనే అన్ని దేశాలను తిరిగి వస్తుంది.

ఈరోజు వరల్డ్ కప్ ప్రమోషన్స్ లో భాంగా ఐసీసీ తన ట్విట్టర్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్...ట్రోఫీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కింగ్ ఖాన్ చేతిలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ....మరింత దగ్గరగా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఐసీసీ షేర్ చేసిన 30 నిమిషాల్లో ఈ పోస్ట్ 1లక్షా 50వేలకు లైక్ లను పొందింది. దీన్ని చూసి ఇండియన్స్ తెగ ఉత్సాహపడుతున్నారు. మిగతాదేశాలకు వార్నింగ్ ఇచ్చిందని....కప్ గెలవకుండా భారత్ ను ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు.

ఈసారి ప్రపంచకప్ కు వేదిక భారత్ అవుతోంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేసేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ తో టోర్నీ ఆరంభమవుతోంది. 8వ తారీఖున ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.


Tags:    

Similar News