నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్... సర్వం సిద్ధం

Update: 2023-06-07 05:15 GMT

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిన్) ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ ఉత్కంఠ పోరు ఓవల్ మైదానంలో మద్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్ల కోసారి జరిగే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 2 లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి. ఈ సారి టాప్ ప్లేస్ లో 152 పాయింట్లతో ఆస్ట్రేలియా ఉండగా 127 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.



ఫైనల్ టైటిల్ కోసం టీమిండియా ఫైట్ చేయడం వరుసగా ఇది రెండోసారి. ఇంతకుముందు ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్‌ ఫైనల్ జరగ్గా.. న్యూజిలాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే గతంలో చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ కాంబినేషన్‌లో మార్పులు చేసుకోని బరిలోకి దిగనుంది. ఇద్దరు స్పిన్నర్లకు బదులు ఏకైక స్పిన్నర్‌తో ఆడనుంది. రవి చంద్రన్ అశ్విన్‌కు బదులు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌తో ఆడనుంది. ఎక్స్‌ట్రా పేసర్‌గా ఉమేశ్ యాదవ్ ఆడనున్నాడు. వికెట్ కీపింగ్ విషయంలోనూ కేఎస్ భరత్‌కు బదులు ఇషాన్ కిషన్‌తో బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనుండగా.. చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. జడేజా, శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనుండగా.. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం రెండు పిచ్‌లు రెడీ చేసింది ఐసీసీ(అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి). ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ఇంధ‌న సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను ధ్వంసం చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ఆ నిర‌స‌న‌కారులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఐసీసీ.. కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ క్రికెట్ మైదానంలో జ‌రుగుతున్న ఫైన‌ల్ కోసం రెండు పిచ్‌ల‌ను సిద్ధంగా ఉంచింది. ఐసీసీ నిబంధ‌న‌ల మేరకే ఆ పిచ్‌ల‌ను రెడీ చేసిన‌ట్లు చెప్పింది. గ్రౌండ్ వ‌ద్ద సెక్యూర్టీని కూడా పెంచిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఐసీసీ సెక్ష‌న్ 6.4 రూల్ ప్ర‌కారం .. బ్యాక‌ప్ పిచ్‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ మ్యాచ్ జ‌రిగే పిచ్ దెబ్బ‌తింటే అప్పుడు ఆ ప‌రిస్థితిని అంచ‌నా వేసి ఆ త‌ర్వాత మ‌రో పిచ్‌ను వాడాలా వ‌ద్దా అన్న నిర్ణ‌యం తీసుకోనున్నారు. రెండు పిచ్‌ల రూల్ గురించి భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌కు తెలియ‌జేశారు. ఒక‌వేళ ఇద్ద‌రు కెప్టెన్లు రెండో పిచ్‌పై ఆడేందుకు అంగీక‌రిస్తే అప్పుడు మ్యాచ్ కొన‌సాగుతుంది, లేదంటే ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News