వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు ముందు భారత్ ఊహించని ఎదురదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక ప్లేయర్స్ గాయాలతో ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యారు. ప్రస్తుత జట్టులోని సభ్యులు కూడా గాయాలు బారిన పడడం కలవరపెడుతోంది. తాజాగా టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ నెట్స్‌లో గాయపడ్డాడు. నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ విసిరిన ఇషాన్ మోచేతిని బలంగా తాకడంతో గాయమైంది. నొప్పితో విలవిలలాడిన అతడు వెంటనే ప్రాక్టీస్ నుంచి వైదొలిగాడు. తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. కాసేపటికి చేతికి కట్టుతో ఇషాన్ కిషన్ కనబడడం కలవరపెట్టింది. ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ గాయపడడంతో WTC ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. తుది జట్టులో చోటు కోసం అతడు కేఎస్ భరత్ తో పోటీ పడుతున్నాడు. వీరిద్దరిలో వికెట్ కీపర్‌గా ఎవరిని తీసుకోవాలా అని మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది. పలువురు మాజీలు, అభిమానులు సైతం ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈక్రమంలోనే అతడు గాయపడడంతో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గాయం కారణంగా ఇషాన్ దూరమైతే కేఎస్ భరత్ లైన్ క్లియర్ అవుతోంది.
జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభకానుంది. భారత్, ఆసీస్‌లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. గత WTC ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత్..ఈసారి కప్పుకొట్టాలని భావిస్తోంది.