తొందర్లోనే రింకూ సింగ్ టైం వస్తుంది: ఇర్ఫాన్ పఠాన్

Update: 2023-07-06 02:58 GMT

రింకూ సింగ్.. ఐపీఎల్ సంచలనం. ఐపీఎల్ 2023లో కోల్ కతా తరుపున అతని ఆట చూసి.. రాబోయే సిరీసుల్లో బీసీసీఐ అతన్ని ఎంపిక చేస్తుందని భావించారంతా. ఆ ఊహాగానాలను కాదన్నట్లు.. రింకూకు మొండి చేయి చూపించింది. వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. దాంతో మాజీ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. రింకూకు అండగా నిలిచాడు. రాబోయే రోజుల్లో జట్టులో తప్పకుండా చోటు దక్కుతుందని ధైర్యాన్ని నింపాడు.




 


త్వరలోనే రింకూ టైం వస్తుందని ట్వీట్ చేశాడు ఇర్ఫాన్. ఈ క్రమంలో రింకూను జట్టులోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ‘రింకూను మరో సర్ఫరాజ్ ఖాన్ చేస్తున్నారని, అలా చేయకుండా చూడాలని సెలక్టర్లను కోరుతున్నారు. ఫాలో ఉన్న ప్లేయర్ కు అవకాశాలు ఇవ్వాల’ని సూచిస్తున్నారు. 




Tags:    

Similar News