పూరన్ ఒంటి నిండా వాతలే.. అయినా

Update: 2023-08-14 16:57 GMT

టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ అద్భుత బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ కూడా అందుకున్నాడు. మూడు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో విండీస్ 3-2తో 17 ఏళ్ల తర్వాత భారత్ పై టీ20 సిరీస్ గెలిచింది. ఏకంగా 141.94 స్ట్రైక్ రేట్ తో 176 పరుగులు చేశాడు.




 


ఇంత చేసిన పూరన్ కు ఆ గెలుపు ఊరికే దొరకలేదు. ఐదో మ్యాచ్ లో విండీస్ ఆటగాడు బ్రాండన్ కింగ్, భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు బ్రాండన్ కొట్టిన షాట్ నేరుగా వచ్చి పూరన్ చేతికి తాకింది. దాంతో చేయి విరిగినంత పనైంది. తర్వాత అర్ష్ దీప్ బౌలింగ్ షాట్ మిస్ అవగా.. బంతి నేరుగా వచ్చి పొట్టలో తాకింది. దాంతో కాలినట్లు కమిలిపోయిన గాయాలయ్యాయి. మ్యాచ్ అనంతరం వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





Tags:    

Similar News