Asia Cup 2023: పొరపాటా.. ఓవర్ కాన్ఫిడెన్సా..! పాక్ బ్యాట్స్మెన్ ఓవర్ యాక్షన్

Byline :  Bharath
Update: 2023-08-30 12:58 GMT

ఆసియా కప్ 2023 పోరు మొలయింది. బుధవారం (ఆగస్ట్ 30) ముల్తాన్ వేదికపై జరుగుతోన్న మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్, నేపాల్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు పసికూన నేపాల్ ఆరంభంలోనే షాక్ ఇచ్చింది. 25 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను పడగొట్టి పాక్ బ్యాట్స్ మెన్ కు ఎదురుదెబ్బ కొట్టింది. తర్వాత రాణించిన పాక్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజమ్ (92, 97 బంతుల్లో), రిజ్వాన్ (44, 50 బంతుల్లో) స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో 100 పరుగుల మార్క్ ను దాటింది పాక్. ఇక పాక్ కు అడ్డుకట్ట వేయలేరా? అనుకునే టైంలో 124 పరుగులకే మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.




 


ఈ క్రమంలో పాక్ బ్యాట్స్ మెన్ ఇమామ్ ఉల్ హక్ (5, 14 బంతుల్లో), మహమ్మద్ రిజ్వాన్ రన్ ఓట్ అయ్యారు. వాళ్లు రన్ ఔట్ అయిన తీరుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఫైన్ లెగ్ లో డిఫెండ్ చేసిన ఇమామ్.. అనవస రన్ కు పరిగెత్తాడు. దాంతో బాల్ అందుకున్న నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ మెరుపుత్రో విసిరి ఇమామ్ ను ఔట్ చేశాడు. ఈజీ రన్ వచ్చే క్రమంలో రిజ్వాన్ బద్దకంతో వికెట్ పారేసుకున్నాడు. దీపేందర్ సింగ్ అతన్ని రన్ చేశాడు. పసికూన నేపాల్ లైన్ అండ్ బంతులేస్తూ పాక్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తున్నారు. మెరుపు ఫీల్డింగ్ తో రన్స్ తీయకుండా చూస్తున్నారు.


 





 





Tags:    

Similar News