Asia cup2023: మిడిల్ ఆర్డర్లో కుర్రాడికి ఛాన్స్.. కానీ?

Byline :  Bharath
Update: 2023-09-02 10:30 GMT

ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకెలె వేదికపై జరుగుతున్న పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకుంటున్నాడు. ఈ మ్యాచ్ జరుగుతుందా అని అంతా అనుమానపడగా.. వరుణుడు కాస్త వెనక్కి తగ్గడంతో ఆట ప్రారంభించారు. పల్లెకెలె మొత్తం మేగాలు వ్యాపించి ఉండగా.. మ్యాచ్ కు ముందు వర్షం పడే సూచనలు 40శాతానికి తగ్గాయి. ఈ క్రమంలో ఆట 50 ఓవర్లు కొనసాగుతుందని అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ అయి ఐదు ఓవర్లు కూడా కాలేదు.. అనుకోకుండా వర్షం పడేసరికి అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. వర్షం కొంత తగ్గుముఖం పడితే.. మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదిస్తారు. లేదంటే డక్వర్త్ లూయిస్ మెథడ్ లో కొనసాగిస్తారు. లేదా ఇలానే కొనసాగితే.. మ్యాచ్ ను డ్రాగా ప్రకటించి రెండు టీంలకు చెరో పాయింట్ ఇస్తారు.




 


రసవత్తరంగా మొదలైన మ్యాచ్ లో భారత్ కు శుభారంభం లభించింది. గత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లతో పోల్చితే బ్యాట్స్ మెన్ నిలకడ ప్రదర్శిస్తున్నారు. పాక్ బౌలర్ల దాడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ (11, 18 బంతుల్లో, నాటౌట్), శుభ్ మన్ గిల్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. శుభ్ మన్ ఖాతా తెరవక పోయినా ఒత్తిడిని ఎదుర్కొని క్రీజులో నిలిచాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది రెండు ఓవర్లు వేసి 11 పరుగులు ఇవ్వగా.. నసీమ్ షా రెండు ఓవర్లు వేసి 3 పరుగులే ఇచ్చుకున్నాడు. ఇక భారత బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇచ్చారు. బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్, జడేజాచ కుల్దీప్, షార్దూల్ ను ఎంపిక చేశారు.




 


తుది జట్లు:

భారత్ ప్లేయింగ్ 11:రోహిత్ శర్మ (సి) , శుభ్‌మన్ గిల్ , ఇషాన్ కిషన్ (వికె) , విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , హార్దిక్ పాండ్యా , రవీంద్ర జడేజా , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్ ప్లేయింగ్ 11: ఫఖర్ జమాన్ , ఇమామ్-ఉల్-హక్ , బాబర్ ఆజం (c) , మహ్మద్ రిజ్వాన్ (wk) , అఘా సల్మాన్ , ఇఫ్తీకర్ అహ్మద్ , షాదాబ్ ఖాన్ , మొహమ్మద్ నవాజ్ , షాహీన్ అఫ్రిది , నసీమ్ షా , హరీస్ రవూఫ్



Tags:    

Similar News