Asia Cup 2023: రేపే రోహిత్ సేన ప్రయాణం.. పాపం వాళ్ల పరిస్థితే!

Byline :  Mic Tv Desk
Byline :  Bharath
Update: 2023-08-28 15:48 GMT

మరో రెండు రోజుల్లో ఆసియా కప్2023 ప్రారంభం కానుంది. ఆగస్ట్ 30న ఆతిథ్మ పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరుగనుండగా.. రేపు (ఆగస్ట్ 29) టీమిండియా శ్రీలంకకు పయణం అవుతుంది. దీనికోసం బెంగళూరు సమీపంలోని అలూరులో క్యాంప్ ఏర్పాటు చేసుకుని టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లందరికీ ఆదివారం రెస్ట్ ఉన్నప్పటికీ టీమ్ మీటింగ్స్ డెక్సా టెస్టుల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రాక్టీస్ సెషన్ లో శ్రేయస్ అయ్యర్ రాణించినప్పటికీ టీం మేనేజ్మెంట్ లో మాత్రం నమ్మకం కలగట్లేదు.




 


ఇక కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోలేదని తెలిసిందే. ఇంకా అతను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో మొదటి మ్యాచ్ లకు రాహుల్ ను దూరం పెడుతున్నామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. పలువురు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కూడా కేఎల్ రాహుల్ కు తుది జట్టులో చోటు కల్పించకూడదని సలహాలిచ్చారు. ప్రాక్టీస్, ఫిట్ గా లేని ఆటగాళ్లను ఆడించి మరోసారి ఫెయిల్ కావొద్దని సూచిస్తున్నారు. ప్రయోగాలు పక్కనపెట్టి ఈసారైనా సరైన టీంను ఆడించాలని కోరుతున్నారు. సంజూ శాంసన్, ఇషార్ కిషన్ లలో ఒకరిని ఎంపిక చేసి ఆడిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.




Tags:    

Similar News