టీమిండియా ఆటగాళ్లకు దెబ్బ మీద దెబ్బ.. ట్రోఫీ లేదు, డబ్బులు రాలే

Update: 2023-06-12 11:25 GMT

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడిపోయి బాధపడుతున్న టీమిండియా ఆటగాళ్లకు.. ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. అలాగే.. గెలుపు ఆనందంలో ఉన్న ఆసీస్ కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 80 శాతం కట్ చేశారు. అయితే, నిర్ణీత సమయానికంటే తక్కువగా భారత్ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు బౌలింగ్ చేసిందని ఐసీసీ తెలిపింది.




 

గిల్కు 115 శాతం జరిమానా:

భారత రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఔట్ అయిన తీరు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ గిల్ 115 శాతం జరిమానా విధించింది. గిల్ ఔట్ అయిన తర్వాత ‘థర్డ్ అంపైర్ కళ్లు సరిగ్గా కనపడకపోతే.. భూతద్దాలు వాడొచ్చుకదా’ అన్నట్లు ఇమోజీలతో ట్వీట్ చేసి, అంపైర్లపై అసంతృప్తి తెలిపాడు. అయితే, దీనిపై సీరియస్ అయిన ఐసీసీ.. ఆర్టికల్ 2.7 కింద, అంతర్జాతీయ మ్యాచ్ లో జరిగిన ఘటనలపై బహిరంగ విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గిల్ పై చర్యలు తీసుకుంది.




 


Tags:    

Similar News