తిలక్ వర్మకు గొప్ప అవకాశం.. వరల్డ్ కప్లో..

Update: 2023-08-14 16:39 GMT

టీమిండియా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ కు చాకు లాంటి బ్యాట్స్ మెన్ దొరికాడు అంటున్నారు. వెస్టిండీస్ తో జరిగి టీ20 మ్యాచ్ లో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. యువతేజం, లెఫ్టార్మ్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ రూపంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ బలపడింది. విండీస్ సిరీస్ లో అదరగొట్టిన తిలక్ వర్మ.. అందరి దృష్టిని ఆకర్శించాడు. దాంతో వన్డే వరల్డ్ కప్ లో తిలక్ కు చోటు కల్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో యువరాజ్ సింగ్, సురేష్ రైనాల స్థానాన్ని భర్తీ చేస్తాడని అంటున్నారు.




 


వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో బ్యాట్ తో, బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, వర్మ ప్రదర్శనకు సంతృప్తి చెందిన సెలక్టర్లు.. 2023 ప్రపంచ కప్ కోసం టీమిండియాకు సెలెక్ట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. సుదీర్ఘకాలం ఆడే ఆటగాళ్లు ఎంపిక చేయాలంటే.. అందుకు వర్మ సరైన వాడని చెప్తున్నారు.




Tags:    

Similar News