ఫ్రీగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ చూసేయొచ్చు...ఏం చేయాలంటే ?

Update: 2023-08-13 16:38 GMT

శ్రీలంక వెళ్లి ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్ ఉచితంగా చూడాలనుకుంటున్నారా ? అయితే మీరు ఈ సూపర్ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రఖ్యాత జర్మన్ కార్ మేకర్ వోక్స్ వ్యాగన్

తన కార్లపై అదరిపోయే ఆఫర్స్‌ను ప్రకటించింది. ఊహించని విధంగా తగ్గింపులను ప్రకటించింది. స్పెషల్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఆ వివరాలు ఏంలో ఇప్పుడు తెలుసుకుందాం.

వోక్స్ వ్యాగన్ తైగూర్ మోడల్ కారును రూ.1.60 లక్షల తగ్గింపుకే అందిస్తోంది. అంతే కాకుండా ఈ కారును ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 5 మధ్య కాలంలో కొనుగోలు చేసినట్లయితే ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ లు చూసే అవకాశాన్ని పొందవచ్చు. ఇక కంపెనీ అందిస్తున్న మొత్తం తగ్గింపులో లక్ష రూపాయలు నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఉండగా.. మరో రూ.60 వేలను లాయల్టీ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజీ బోనస్ రూపంలో అందిస్తోంది.




 


వోక్స్ వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చు. వర్చుస్ కారు కొనుగోలుదారులకు రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని ఎక్స్ఛేంజీ బోనస్ రూపంలో అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు కొనేవారికి సైతం శ్రీలంక వెళ్లేందుకు అవకాశం ఉంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నికి ఆఫీషియల్ పార్ట్‌నర్‌గా వోక్స్ వ్యాగన్ ఉంది. 




 


Tags:    

Similar News