బారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. హెట్మెయిర్ అర్ధసెంచరీ(39 బంతుల్లో 61) చెలరేగాడు. హై హోప్ 29 బంతుల్లో 45 పరుగులతో విజృంభించాడు. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హెట్ మెయిర్, హోప్ జోడి ఆదుకుంది. ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హోప్ అయ్యాక మరో రెండు వికెట్లు వరుస కోల్పోయినా చివర్లో హెట్ మెయిర్ చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. భారత్ బౌలర్లలో అర్షదీప్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, చాహల్, ముఖేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.