వరల్డ్కప్ నుంచి పాక్ తప్పుకుంటే.. ఏం జరుగుతుంది..?

Update: 2023-07-11 05:24 GMT

భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ పాకిస్థాన్ ఆడుతుందా..? లేదా..? గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులను వేదిస్తున్న ప్రశ్న ఇది. దానికి సమాదానం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో అహ్మదాబాద్ వేదికపై భారత్, పాక్ మ్యాచ్ చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగింలింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన పాక్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ.. ‘పాక్ లో నిర్వహించే ఆసియాకప్ 2023లో భారత్ పాల్గొనక పోతే.. మా జట్టును కూడా భారత్ లో జరిగే వరల్డ్ కప్ కు పంపబోము. భారత్ ఎలాగైతే తటస్థ వేదికపై ఆడేందుకు మొగ్గు చూపించిందో.. పాక్ కోసం కూడా వేరే వేదికను ఏర్పాటు చేయాల’ని డిమాండ్ చేశారు.




 


దీంతో వరల్డ్ కప్ లో పాక్ ఆడుతుందా లేదా అన్న ప్రశ్న మరోసారి తలెత్తింది. పాక్ మాజీ చైర్మన్ నజం సేథీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను అంగీకరించినా.. ఆయన దిగిపోయిన తర్వాత మళ్లీ ఈ గొడవను మొదలుపెట్టారు. పాక్ డిమాండ్ ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించినా.. పాక్ బోర్డ్ మాత్రం మొండి పట్టు పట్టుకుని కూర్చుంది. క్రికెట్ లో ప్రతీ విషయం బీసీసీఐ చెప్పినట్లే చేస్తోందని పాక్ ఆరోపిస్తోంది.

అయితే, ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తప్పుకుంటే.. స్కాట్ల్యాండ్ అర్హత సాధింస్తుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో మూడో స్థానంలో నలిచిన జట్టు ఇందుకు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన జింబాబ్వేలో జరిగిన టోర్నీలో స్కాట్ల్యాండ్ మూడో స్థానం దక్కించుకుంది. 




 




Tags:    

Similar News