భారత్ 296 ఆలౌట్..ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యం

Update: 2023-06-09 13:31 GMT

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్‌లో 173 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి మూడో రోజు రెండో సెషన్ పది ఓవర్లలోపే భారత్ తోకముడిచింది.

ఆదుకున్న రహానె, శార్దూల్

మూడో రోజు 151/5 స్కోర్‌తో ఆట ప్రారంభించిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కేఎస్ భరత్‌ను బోలాండ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రహానె, శార్దూల్ ఠాకూర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆసీస్ విసిరిన బుల్లెట్ బంతులను కాచుకుంటూ క్రీజ్‌లో నిలబడ్డారు. ఈ క్రమంలోనే రహానె తన హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇద్దరు నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తూ భారత్ స్కోరులో వేగం పెంచారు. ఈ జోడి ఆరో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ శిబిరాల్లో ఆశలు నింపింది. అయితే సెంచరీ సాధిస్తాడునుకున్న రహానె(89) కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ అద్భుతమైన క్యాచ్‌కు బలైపోయాడు. తర్వాత అర్థసెంచరీ సాధించిన శార్దుల్(51) ఔట్ కావడంతో భారత్ తొందరగానే ఇన్నింగ్స్ ముగించింది. చివరిలో షమీ 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు సాధించాడు. భారత్ బ్యాటర్లలో రహానె 89, శార్దూల్ 51 పరుగులతో పాటు రవీంద్ర జడేజా 48 రన్స్ తో రాణించారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్ 3, స్టార్ట్క్, బోలాండ్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. లియాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.


Tags:    

Similar News