థంబ్ : ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ మధ్య పోటీ..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఓవల్ మైదానంలో జూన్ 7న మ్యాచ్ ప్రారంభం కానుంది. టైటిల్ కోసం భారత్ - ఆస్ట్రేలియా జట్టులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరుసుగా రెండోసారి ఫైనల్‌లో ప్రవేశించిన భారత్ జట్టు ఈసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. గాయాలతో కీలక ప్లేయర్స్ జట్టుకు దూరమైన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
కీపర్ ఎవరు ?
ఫైనల్‌లో విజయమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది. జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే కీపర్‌గా ఎవరిని ఆడిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌లో గాయపడిన రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి రావడంతో కేఎస్ భరత్‌కు పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఇషాన్ కిషన్‌నే ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండర్ కావడం, వన్డేలో డబుల్ సెంచరీ బాదడం అంశాలు పరిగణలోకి తీసుకుని ఇషాన్ తుదిజట్టులో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. పలువురు మాజీలు మాత్రం కేఎస్ భరత్ ను ఆడించాలని సూచిస్తున్నారు.
భరత్‌కే నయాన్ మోంగియా ఓటు
టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగియా భరత్ వైపే మొగ్గు చూపాడు. భారత్ స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఏదో ఒక మ్యాచ్‌లో రాణించని కారణంగా పక్కనపెట్టడం కరెక్ట్ కాదని తెలిపాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని.. అక్కడ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం అన్నాడు నయాన్ మోంగియా. . డ్యూక్స్ బంతులతో ఆడేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలన్నాడు. తప్పనిసరిగా కేఎస్ భరత్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.