పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్ సింగ్ భార్య.. ఫొటో షేర్ చేస్తూ!

Update: 2023-08-26 07:20 GMT

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్.. మరోసారి తండ్రయ్యాడు. శుక్రవారం యువీ భార్య హేజిల్ కీచ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తన రాకతో తమ కుటుంబం సంపూర్ణమయిందంటూ చెప్పుకొచ్చాడు. ‘నిద్రలేని రాత్రులు ఆనంద ఘడియలుగా మారాయి.




 



 యువరాణి ఆరాకు స్వాగతం’ అంటూ తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు. 2016లో నటి, మోడల్ అయిన హేజిల్ కీచ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యువీ. గతేడాది ఈ ఇద్దరు అబ్బాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అతనికి ఓరియన్ కోచ్ సింగ్ అని పేరు పెట్టారు.

Tags:    

Similar News