విజయ్-అనసూయల గొడవను కుక్కలు కొట్టుకోవడంతో పోల్చిన ఆనంద్
యాంకర్ అనసూయ, హీరో విజయ్ దేవరకొండ మధ్య వార్ చాలా రోజులబట్టీ నడుస్తోంది. వీరిద్దరూ డైరెక్ట్ గా ఒకరితో ఒకరు కొట్టుకోకపోయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ గొడవలు పెట్టుకుంటారు. విజయ్ పెద్దగా ఏమీ అనడు. కానీ అతని ఫ్యాన్స్ అనసూయతో కలిసిరచ్చ రచ్చ చేస్తారు. దీనికి సంబంధించి విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సంచలన కామెంట్స్ చేశాడు.
అన్న స్టార్ ను నమ్ముకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి నుంచి కొత్త తరహీ, వెరైటీ కథలను ఎంచుకుంటూ ముందుకుపోతున్నాడు. ఇతని సినిమాలు బాక్సీఫీస్ బద్దలు కొట్టవు కానీ బావున్నాయని మాత్రం అనిపించుకుంటాయి. ఈరోజే ఆనంద్ కొత్త సినిమా బేబీ విడుదల అయింది. దీని ప్రమోషన్స్ లో భాగ్గా ఇతను ఇచ్చిన ఇంటర్వూలో చాలా విషయాలను పంచుకున్నాడు. అందులో భాగంగానే విజయ్, అనసూయల గొడవ మీద కూడా స్పందించాడు.
విజయ్ ను ఎప్పుడూ తిట్టిపోసూ అనసూయ ఆనంద్ ను మాత్రం మెచ్చుకుంది. బేబీ మూవీలో అతను చాలా ఇంటెన్సివ్ గా ఉన్నాడని చెప్పింది. దీంతో సోసల్ మీడియాలో మళ్ళీ గొడవ అయింది. అన్నను తిట్టి తమ్ముడుని పొగడడం ఏంటని కామెంట్స్ వచ్చాయి. దీని గురించి ఆనంద్ ను అడగ్గా....వాళ్ళిద్దరి మధ్యా ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. నాకు తెలిసి ఏం ఇష్యూ లేదు. ఎప్పుడూ ఒక సైడ్ నుంచే కామెంట్రీ ఉంటుంది. తన బేబి సినిమా గురించి అనసూయ కామెంట్ చేసినట్టుగా కూడా నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు ఆనంద్. సోషల్ మీడియాలో బోల్డ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఒక మీమ్ ఉంటుంది. ఒక గేటుకు అటువైపు, ఇటువైపు రెండు కుక్కలు కొట్టుకుంటూ ఉంటాయి. తీరా చేస్తే ఆ గేటు కు గోడ ఉండదు. అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది.. ఆ రెండు కుక్కలు పక్కకు వచ్చి ఎదురెదురు కొట్టుకోవచ్చు. కానీ, రావు. ఆ గేట్ గ్రిల్ వద్దనే అరుస్తాయి. ఇది కూడా అచ్చం అలాంటిదే. మన ఎదురుగా ెవరున్నా మనం ఏమీ మాట్లాడం... కానీ వాడు అలా పక్కకు వెళ్ళగానే ట్విట్టర్ లాంటి వాటిల్లో ఏకి పారేస్తాం. లోకం అలా ఉంది ఇప్పుడు. సోషల్ మీడియా మంచిది, కాదు అని ఎవ్వరూ చెప్పరు కానీ అందులో అందరూ జాయిన్ అయిపోతారు అంటారు చెప్పుకొచ్చాడు ఆనంద్.
ఇతను నటించిన బేబీ మూవీ ఈరోజు విడుదల అయింది. రివ్యూలు పాజిటివ్ గానే వస్తున్నాయి. దర్శకుడు సాయి రాజేష్ మంచికథను, నటి కాలానికి తగ్గట్టుగా తీశాడని చెబుతున్నారు.