ఆసియా అధ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో స్వర్ణం అందుకున్న ఏపీ అమ్మాయి జ్యోతిస్వర్ణ

Update: 2023-07-14 04:39 GMT

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో ఆంధ్రా అమ్మాయి పసిడి కొట్టింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రాకు చెందిన జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది.

థాయ్ లాండ్ రాజధీనా బ్యాంకాక్ లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియషిప్స్ జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ లో ఎవ్వరూ ఊహించని విధంగా తన పేరులోని స్వర్ణాన్ని మెడలో వేయించుకుంది ఆంధ్రా అమ్మాయి జ్యోతి స్వర్ణ. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి ఛాంపియన్ గా నిలిచింది. అంతకు ముందు జాతీయ అంతర్ రాష్ట్ర ఛాంపియన్ షిప్స్ లో జ్యోతి 12.92 సెకెన్లలోనే రేసును ముగించి స్వర్ణాన్ని అందుకుంది. అయితే ఇప్పడు ఈ పోటీలలో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండడంతో 13 సెకెన్లలోపు పూర్తి చేయలేకపోయింది. 50 ఏళ్ళ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ కు ఈ పతకం రావడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించినది తొలి భారతీయురాలు ఆంధ్రా అమ్మాయి కావడం మరీ ప్రత్యేకత.

జ్యోతి స్వర్ణ ఆంధ్రాలోని విశాఖ జిల్లా నుంచి వచ్చింది. ఈమె ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ పతకం సాధించి వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు అర్మత సాధించింది. జ్యోతి భువనేశ్వర్ లో ఇంగ్లండ్ కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. గత రెడేళ్ళుగా ఈమె జాతీయ, అంతర్జాతీయ పతకాలను నిలకడగా సాధిస్తోంది. ఇప్పడు ఈ ఈవెంట్లో పతకం సాధించడం ద్వారా వార్తల్లో నిలిచింది. స్వర్ణం సాధించిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతా అంబానీలు అభినందనలు తెలిపారు. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్‌ కుమార్‌ సరోజ్‌... పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్‌ పసిడి పతకాలు నెగ్గారు.





Tags:    

Similar News