US Execution : ఇంజెక్షన్ కోసం నరం దొరకలేదని మరణశిక్ష వాయిదా

Byline :  Krishna
Update: 2024-02-29 06:41 GMT

మరణ శిక్ష అనేది క్రూరమైన నేరాలు చేసేవారికి విధిస్తారు. ఈ మరణశిక్షను చాలా దేశాలు రకరకాలుగా అమలు చేస్తుంటాయి. అందులో అమెరికా కొత్త తరహా మరణశిక్షలను అమలు చేస్తోంది. ఇటీవలే నైట్రోజన్ వాయువు వినియోగించి ఓ ఖైదీకి మరణ శిక్ష అమలు చేసింది. తాజాగా మరో ఖైదీకి ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు అనుకున్నారు. దీన్ని కోసం అంతా సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో ఊహించని కారణంతో ఈ మరణశిక్ష వాయిదా పడింది.

అమెరికాలోని ఇడాహోకు చెందిన థామస్ క్రీచ్ 40ఏళ్ల నాటి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టు అతనికి 1981లోనే మరణ శిక్ష విధించింది. తాను కనీసం 12మందిని చంపినట్లు అప్పట్లో థామస్ చెప్పాడు. ఈ క్రమంలో అతడికి నరాల ద్వారా ప్రాణాంతక డ్రగ్ ను ఇచ్చి మరణ శిక్షను అమలు చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. డాక్టర్స్ టీం అతడికి నరాల్లోకి ఇంజెక్షన్ను ఎక్కించేందుకు ప్రయత్నించగా.. అతడి నరాలు దొరకలేదు. 8సార్లు ప్రయత్నించినా ఐవీ లైన్ కన్పించకపోవడంతో శిక్షను వాయిదా వేశారు.

ఇలా నరం దొరకకా మరణ శిక్ష వాయిదా పడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో 24 మరణశిక్షలు జరిగాయి, అవన్నీ ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా అమలు చేయబడ్డాయి. ఇక అమెరకాలోని పలు రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి.  


Tags:    

Similar News