జాహ్నవి మృతికి కారణమైన పోలీస్‌కు క్లీన్ చిట్..

Byline :  Vamshi
Update: 2024-02-22 06:24 GMT

అమెరికాలో ఏపీకి చెందిన కందుల జాహ్నవి మృతికి కారణమైన పోలీసు కెవిన్ డవేకు అక్కడి అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. అతడిపై ఎలాంటి నేరభియోగాలు మోపడం లేదని ప్రకటించారు. సాక్ష్యధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆమె మృతికి చులకనగా మాట్లాడిన మరో పోలీసు డేనియల్ అడెరెర్ ప్రమాద సమయంలో అక్కడ లేరని తెలిపారు. వచ్చే నెల 4న కెవిన్ డేవ్ పై శాఖాపరమైన విచారణ జరగనుందని, ఆ విచారణకు హాజరై డేవ్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. డేవ్ వివరణతో విచారణ కమిటీ సంతృప్తి చెందనట్లైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై జాహ్నవి కందుల తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని భారత విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.

కారుతో ఢీ కొట్టి జాహ్నవి మృతికి కారణమైన అధికారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. గతేడాది జనవరి 23న సియాటెల్ లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోల్ కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారు నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ కెవన్ డేవ్ కారణమని, 40 కి.మీ. స్పీడ్ తో వెళ్లాల్సిన రోడ్డుపై 100 కి.మీ. స్పీడ్ తో దూసుకెళ్లడమే ప్రమాదానికి దారి తీసిందని విచారణలో తేలింది. స్థానిక మీడియా కూడా ఈమేరకు కథనాలు ప్రసారం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో అధికారి చేసిన కామెంట్స్ పైన దుమారం రేగింది. దీంతో ప్రమాదానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ తో పాటు జాహ్నవి మరణంపై చులకన వ్యాఖ్యలు చేసిన మరో అధికారిపైనా చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News