విశాఖ స్టీల్ ప్లాంట్‌పైనా కేంద్రం కుట్రలు : షర్మిల

Byline :  Vamshi
Update: 2024-03-16 13:52 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు బహిరంగ సభను నిర్వహించారు. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతూ విశాఖ ప్లాంట్‌పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నారని ఆరొపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను క్రమంగా నష్టాల్లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ముందుకెళ్తుంటే దాన్ని ఆపేందుకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని. తిరిగి తెరచాటున ఉక్కు పరిశ్రమ గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందోననే భయంతోనే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రైవేట్ స్టీల్​ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్​ ప్లాంట్​ను మాత్రం పట్టించుకోవడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.వైజాగ్ స్టీల్‌ను రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News